లక్ష్మణ్ |
కాంగ్రెస్ చచ్చిన పార్టీ అని, వచ్చే ఎన్నికలలో తెలంగాణాలో నామరూపాలు లేకుండా పోతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ఆయన ఏఐసిసి అద్యక్ష్యుడు రాహుల్ గాంధీ, తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీపై చేసిన విమర్శలను ఆయన ఖండించారు. రాహుల్ చేస్తున్న ఆరోపణలలో ఏ మాత్రం నిజం లేదని లక్ష్మణ్ అన్నారు.
రాహుల్ ఎక్కడికి ప్రచారానికి వెళితే అక్కడ ఓడిపోవటం ఖాయమని, రాహుల్ ఇప్పటి తెలంగాణ పర్యటన చచ్చిన పార్టీకు మేకప్ వేయటం లాంటిదని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. రాజా సింగ్ రాజీనామా గురించి ప్రస్తావించగా, అది ఇంకా తనకు అందలేదని, అందిన తరువాత స్పందిస్తానన్నారు. పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడుతూ బిజెపి అటువంటి వాటిని ప్రోత్సహించదని, కాంగ్రెస్ లో గెలిచి టిఆర్ఎస్ జెండా కప్పుకున్నవారిని ప్రజలు క్షమించరని ఆయన తెలిపారు.
Post a Comment