సోమనాథ్ ఛటర్జీ భౌతిక కాయాన్ని ఆయన కోరిక మేరకు కుటుంబ సభ్యులు ఎస్‌ఎస్‌కేఎం ఆసుపత్రికి అందచేసారు. ఆయన చర్మాన్ని కాలిన గాయాలతో బాధపడేవారికోసం ఉపయోగించనున్నారు. కాగా కళ్ళ రెటీనాను వేరొకరికి ఉపయోగించారు. మిగిలిన భాగాలను భద్రపరిచి వైద్య పరిశోధనల కోసం ఉపయోగించనున్నట్లు ఆసుపత్రి అనాటమీ వర్గాలు తెలియచేసాయి.
అయితే చటర్జీ మృతదేహాన్ని పార్టీ ఆఫీస్ కు తీసుకు వెళ్లి ఎర్రజండా కప్పి నివాళులర్పించాలని సిపిఎం నాయకులు చేసిన ప్రయత్నాన్ని చటర్జీ కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. బిమన్ బసు ఆయన ఇంటికి వెళ్లగా చటర్జీ కుమారుడు ఆయనపై అరిచినట్లు వార్తలు వచ్చాయి. 2008లో సోమనాథ్ ఛటర్జీని పార్టీ నుండి బహిష్కరించినప్పుడు బసు చేసిన వ్యాఖ్యలు ఛటర్జీతో పాటు కుటుంబ సభ్యులను కూడా బాధించాయని తరువాత వారు తెలియచేసారు.
Post a Comment