తెలంగాణా ఐటీ మరియు మునిసిపల్ శాఖా మంత్రి కెటిఆర్‌కు మరొక అంతర్జాతీయ ఆహ్వానం లభించింది. యూఏఈ ప్రభుత్వం విద్య, వ్యాపార మరియు వాణిజ్య రంగాల్లో తెలంగాణతో మరింత బలమైన సంబంధాలను ఏర్పాటు చేసుకునే దిశగా చర్చలు జరపడానికి ఆయనను ఆహ్యానించింది. ఈ మేరకు ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ జహెడ్ అల్ నాహ్యన్, కెటిఆర్‌కు లేఖను రాసారు.
ఈ లేఖలో అరబ్ ఎమిరేట్స్ మంత్రి, తెలంగాణలో తన పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆతిథ్యాన్ని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం తన దృష్టికి తీసుకువచ్చిన పలు అంశాలపై యూఏఈ పూర్తి సహాయ, సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. కెటిఆర్ వ్యాపార విషయాలతో పాటు, గల్ఫ్ కార్మికుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
Post a Comment