మన కరెన్సీ ముద్రణ చైనాలోనా?

మన కరెన్సీ ముద్రణ చైనాలోనా?
సౌత్ చైనా మార్నింగ్ పోస్టు
మన దేశ కరెన్సీ నోట్లు చైనాలో ముద్రితమవుతున్నాయని సౌత్ చైనా మార్నింగ్ పోస్టు అనే పత్రిక కథనం వెలువరించింది. ఆ కథనం ప్రకారం థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఇండియా, మలేషియా, బ్రెజిల్, పోలాండ్‌లతో పాటు మరికొన్ని దేశాల కరెన్సీలను చైనాలో ముద్రిస్తున్నారు.

2013 తర్వాతనే చైనా విదేశీ నోట్లను ముద్రించడం ప్రారంభించిందని, అంతకు ముందు కేవలం పాశ్చాత్య దేశాలు మాత్రమే కరెన్సీ ముద్రించేవని అందులో తెలిపింది. దీనిని చైనాకు సాంకేతికంగా మరియు ఆర్థికంగా గొప్ప ముందడుగుగా ఆ పత్రిక వ్యాఖ్యానించింది.

దీనిపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆందోళన వ్యక్తం చేసారు. పాకిస్తాన్ తో చైనాకు ఉన్న సన్నిహిత సంబంధాలను ఆయన ప్రస్తావించారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post