సోమనాథ్ ఛటర్జీ ఇక లేరు

సోమనాథ్ ఛటర్జీ ఇక లేరు
File Pic: సోమనాథ్ ఛటర్జీ
లోక్ సభ మాజీ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ (89) ఇవాళ ఉదయం మృతి చెందారు. అనారోగ్యంతో ఆగస్టు 10వ తేదీన కోల్ కతా లోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆయన, నేడు ఉదయం 8.15 గంటలకు కార్డియాక్ అరెస్ట్ తో తుది శ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు.

కమ్యూనిస్టు కురువృద్ధుడైన ఛటర్జీ, గత కొంత కాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. శని వారం నుండి వెంటిలేటర్ సహాయంతో ఆయన జీవించారు. ఆయన గత జులైలో హేమరేజ్ స్ట్రోక్ తో బాధపడ్డారు.

జులై 25, 1929 న జన్మించిన సోమనాథ్ చటర్జీ పదిసార్లు లోక్ సభ ఎంపిగా ఎన్నికయ్యారు. భారతదేశంలో సుదీర్ఘకాలం పార్లమెంట్ సభ్యులుగా  పనిచేసిన వారిలో ఆయన ఒకరు. 2004 నుండి 2009 వరకు ఆయన లోక్ సభ స్పీకరుగా పనిచేశారు.

1968 లో సిపిఐ (ఎం)పార్టీలో చేరిన ఆయన, 2018 లో పార్టీ నుండి బహిష్కరింపబడేంత వరకు అదే పార్టీలో కొనసాగారు. అమెరికాతో అణు ఒప్పదం విషయంలో యూపీఏకు  సిపిఐ (ఎం) తన మద్దతును ఉపసంహరించుకున్న సమయంలో ఆయన పార్లమెంట్లో తన పదవిని వదులుకోవటానికి సిద్ధపడలేదు. 1996 సంవత్సరములో చటర్జీ అత్యుత్తమ పార్లమెంటేరియన్ అవార్డును గెలుచుకున్నారు.

ప్రధాన మంత్రి, రాష్ట్రపతితో పాటుగా ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు.




0/Post a Comment/Comments

Previous Post Next Post