దేవీ మహాత్మ్యం | దుర్గా సప్తశతి

దేవీ మహాత్మ్యం - దుర్గా సప్తశతి
దేవీ మహాత్మ్యం హిందూ మతంలోని అత్యంత పురాతనమైన దేవీ ఆరాధనా గ్రంథము. భగవద్గీతతో సమాన ప్రాధాన్యం దీనికి ఉంది. స్త్రీశక్తిని దేవతగా వర్ణించిన వ్రాతపతుల్లో ప్రారంభ కాలానికి చెందినదని భావిస్తారు. దీనికి దుర్గా సప్తశతి, చండీ పాఠం అనే పేర్లు కూడా ఉన్నాయి.  

మార్కండేయ పురాణంలో 81 నుండి 93 అధ్యాయాలు దేవీ మహాత్మ్యంగా చెప్పబడుతున్నాయి. మార్కండేయుడు దీనిని  జైమినికీ మరియు అతని శిష్యులకు వివరిస్తాడు.  దేవీ మహాత్మ్యం లో భాగంగా 13 అధ్యాయాలలో 700 శ్లోకాలు ఉన్నాయి. 

700 వందల శ్లోకాలు ఉన్నాయి కనుక దుర్గా సప్తశతి పేరు వచ్చింది. మంచికి చెడు కు మధ్య జరిగే యుద్ధాన్ని ఇది వర్ణిస్తుంది. భారతదేశం అంతటా, ఈ శ్లోకాలను  నవరాత్రి వేడుకలలో, దుర్గా పూజ సమయంలో  దేవాలయాలలోనూ, ఇళ్లలోనూ పఠిస్తారు. 


0/Post a Comment/Comments