ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ, రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కూడా రెండు కళ్ళ సిద్ధాంతాన్ని పేర్కొన్నారు. అయితే ఇవి మన అదృష్టవశాత్తు పరస్పర విరుద్ధమైన రెండు కళ్ళు కావు.
మంగళవారం హైదరాబాద్లో లిటిల్ ఫ్లవర్ హైస్కూల్లో తొమ్మిదవ తరగతి విద్యార్ధి 'మీకు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఏది ఇష్టం' అని అడిగితే, ఈ ప్రశ్నకు సమాధానంగా గవర్నర్ 'నీకున్న రెండు కళ్ళలో ఏది ఇష్టం' అని ఎదురు ప్రశ్నించారు. దానికి ఆ విద్యార్థి 'తనకు రెండూ ఇష్టమే'ననగా, 'నాకూ అంతే, నీవే సమాధానం చెప్పావు' అన్నారు.
Post a Comment