చంద్రబాబును వెంటాడుతున్న మోడీ మాటలు

చంద్రబాబుని  వెంటాడుతున్న మోడీ మాటలు
విభజన సమస్యల విషయంలో తెలంగాణ ప్రభుత్వం పరిణతితో వ్యవహరిస్తున్నదనీ, చంద్రబాబు గొడవలకు కారణమవుతున్నాడని ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్లో అన్న విషయం చంద్రబాబుని ఇంకా వెంటాడుతున్నట్లుంది. దానిని ఆయన రోజూ ఎదో ఒక సభలో ప్రస్తావిస్తూ బాధపడుతున్నారు. 

నిన్న అనంతపురం సభలో మాట్లాడుతూ కూడా ఈ విషయంపై బాధ పడ్డారు. తాను 1995లోనే ముఖ్యమంత్రి అయ్యానని, మోడీ 2002 వరకూ ముఖ్యమంత్రి కాలేకపోయారని, అటువంటి వ్యక్తి నా పరిణతిని ప్రశ్నిస్తారా? నాకు మెచ్యూరిటీ లేదంటారా? అని అడిగారు. ఆయన హుందాతనాన్ని కోల్పోయారు. నేను వైసీపీ ట్రాప్‌లో పడ్డానని అంటున్నారు. కానీ బీజేపీ, ఎన్డీఏనే కుడితిలో పడ్డాయి. ఎదో అవకాశం వచ్చి ప్రధానమంత్రి అయ్యారు. మంద బలం ఉందని ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు. ప్రజాహితం కోసం పనిచేయండి. అంటూ ఆక్రోశం వెళ్లగక్కారు.  

0/Post a Comment/Comments