తెలుగులో ఈ మధ్యకాలంలో మంచి సినిమాలు వస్తున్నాయి. దీనితో మన సినిమాలకు ఇతర రాష్ట్రాలలోనూ ఆదరణ దక్కుతోంది. కాగా ఈ వారం విడుదలైన రెండు తెలుగు సినిమాలు విజయవంతమైన టాక్ తెచ్చుకోవటంతో పాటు, IMDB లో కూడా మంచి రేటింగ్ ను సంపాదించాయి. తెలుగు సినిమాలు ఈ స్థాయి రేటింగ్ ను తెచ్చుకోవటం అరుదనే చెప్పాలి.
అడివి శేష్ హీరోగా వచ్చిన గూఢచారి సినిమా 200 రివ్యూల ద్వారా 9 రేటింగ్ సాధించింది. రివ్యూలు పెరుగుతున్నప్పటికీ ఈ సినిమా 9 రేటింగ్ ను కొనసాగించటం విశేషం.
మరో చిత్రం చి.ల.సౌ కు 26 రివ్యూల ద్వారా 9.2 రేటింగ్ వచ్చింది. ఈ సినిమా విషయంలో రివ్యూలు పెరిగే కొద్దీ రేటింగ్ తగ్గవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
Post a Comment