నగరపాలక సంస్థకు ప్రత్యేకంగా అత్యవసర సహాయ బృందం

నగరపాలక సంస్థకు ప్రత్యేకంగా అత్యవసర సహాయ బృందం
పురపాలక శాఖా మంత్రి కెటిఆర్, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కోసం ప్రత్యేకంగా ఎన్ఫోర్స్ మెంట్, విజిలెన్సు మరియు డిజాస్టర్ మానేజ్మెంట్ బృందాన్ని ఏర్పాటు చేసిన సందర్బంగా మాట్లాడుతూ ఇప్పటివరకు నగరంలో 4 లక్షల సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసామని, 10 లక్షలు లక్ష్యంగా నిర్ణయించుకున్నామని తెలిపారు. 

నానక్ రామ్ గూడలో భవనం కూలి ఎనిమిది మంది మృత్యువాత పడిన తరువాత నగర పాలక సంస్థకు కూడా ప్రత్యేక అత్యవసర సహాయ బృందం అవసరమని భావించామని, 250-300 మంది సిబ్బందితో  పూర్తి స్థాయిలో ఏర్పాటు కానున్నట్టు ఆయన తెలిపారు. ఇకనుండి అత్యవవసర సమయంలో ఎవరిని అభ్యర్థించాల్సిన అవసరం లేకుండా, ఆలస్యం లేకుండా రెస్క్యూ, రిలీఫ్ కార్యకలాపాలను నగర పాలక సంస్థే చేపట్టనుందని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు మేయర్ రామ్ మోహన్, పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, ఎమ్మెల్యే చింతల రామచంద్ర రెడ్డి, ఎచ్ఎండిఏ కమిషనర్ చిరంజీవులు, హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డిలు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments