చైనాలో కరెన్సీ ముద్రణ వార్తలు అవాస్తవం

చైనాలో ముద్రణ వార్తలు అవాస్తవం
చైనాలో ముద్రణ వార్తలు అవాస్తవం 
భారత కరెన్సీని చైనాలో ముద్రిస్తున్నారని వస్తున్న వార్తలు అవాస్తవాలని ఆర్థిక శాఖ తెలియచేసింది. సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ లో మన దేశంతో పాటు థాయిలాండ్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక, మలేషియా, ఇండియా, బ్రెజిల్‌, పోలాండ్‌ దేశాలకు చెందిన  కరెన్సీని ముద్రిస్తున్నారని చైనా ప్రభుత్వ అధికారి చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ గార్గ్ చైనాలో కరెన్సీని ముద్రించటం లేదని వివరణ ఇచ్చారు. 

చైనాలో కరెన్సీ ముద్రిస్తున్నారన్న వార్తలపై కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసాయి. సోషల్ మీడియా లో కూడా అనేక వ్యాఖ్యలు వచ్చాయి. ఇప్పుడు ప్రభుత్వం భారత కరెన్సీ ముద్రణ వార్తలు ఖండించిన తరువాత కూడా, పాకిస్తాన్ ప్రభుత్వం మన కరెన్సీ ముద్రణ ఆర్డర్లు ఇచ్చి ఉంటుందని జోకులు వేస్తున్నారు.   

0/Post a Comment/Comments

Previous Post Next Post