స్వామి పరిపూర్ణానందకు హైకోర్టులో ఊరట |
నగర బహిష్కరణ విషయంలో స్వామి పరిపూర్ణానందకు హైకోర్టులో ఊరట లభించింది. ఆరు నెలల పాటు నగరం నుండి బహిష్కరిస్తూ హైదరాబాద్ పోలీసులు తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు స్టే ఇచ్చింది.
శ్రీరాముడిపై కత్తి మహేష్ వ్యాఖ్యలకు నిరసనగా స్వామి పరిపూర్ణానంద చేపట్టిన పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించి ఆయనను గృహ నిర్బంధంలో ఉంచారు. తరువాత గత సంవత్సరం ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసారని, ఇప్పుడు Anti-Social and Hazardous Activities Act, 1980 ప్రకారం ఆరు నెలల పాటు ఆయనను నగరం నుండి బహిష్కరిస్తున్నట్లు గత జులై 11న పోలీసులు ఆయనకిచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు.
అయితే ఈ బహిష్కరణకు వ్యతిరేకంగా స్వామి హైకోర్టులో మూడు వేరు వేరు పిటిషన్లు దాఖలు చేసారు. వీటిలో తెలంగాణ హోమ్ శాఖా కార్యదర్శిని, రాచకొండ, సైబరాబాద్ కమిషనర్లను ప్రతివాదులుగా చేర్చారు. ఇవాళ హైకోర్టు నుండి బహిష్కరణపై స్టే లభించడంతో పరిపూర్ణానంద హైదరాబాద్ రానున్నారు.
Post a Comment