నిజామాబాద్ మాజీ మేయర్ సంజయ్ అరెస్ట్

నిజామాబాద్ మాజీ మేయర్ సంజయ్ అరెస్ట్
అధికార టిఆరెస్ పార్టీ రాజ్య సభ సభ్యుడైన డి.శ్రీనివాస్ కుమారుడు, మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ను లైంగిక వేధింపుల కేసులో ఇవాళ పోలీసులు అరెస్టు చేసారు. గత కొన్ని రోజులుగా ఆయన అజ్ఞాతంలో ఉండటంతో పోలీసులు ఈనెల 10 వ తేదీన ఆయన ఇంటికి నోటీసులను అంటించారు. దీనితో ఆయన ఇవాళ తన న్యాయవాది కృపాకర్ రెడ్డితో కలిసి నిజామాబాద్ ఏసీపీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఆయనను విచారించిన అనంతరం పోలీసులు ఆయనను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. 

శాంకరీ కళాశాలకు చెందిన పలువురు విద్యార్థినిలు సంజయ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఈ విషయమై ఆయనపై 342, 354, 354A, 506, 509 సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద కూడా కేసులు నమోదు అయ్యాయి. ఏసీపీ సుదర్శన్ ఆయనను విచారణ అనంతరం అరెస్టు చేసి న్యాయమూర్తి ముందు హాజరు పరిచారు. 

0/Post a Comment/Comments