శ్రావణ సోమవార వ్రతము

Shravana Somavara Vrathamu
శ్రావణ సోమవార వ్రతము 
సోమవారము శివునికి ఇష్టమైన వారమనే విశ్వాసం ఉంది. శ్రావణ మాసములో మరియు కార్తీక మాసములో భక్తులు ప్రతి సోమవారం శివునికై ఉపవాస వ్రతమును ఆచరిస్తారు.

శ్రావణ సోమవార వ్రతమాచరించేవారు ఉదయమే శుచిగా స్నానం చేసి శివుని ముందర దీపం వెలిగించి, ప్రార్థన చేసి ఉపవాస సంకల్పం తీసుకోవాలి. సాయంత్రం సూర్యాస్తమయ సమయములో స్నానం చేసి శివ పూజ చేయాలి. ముందుగా గణపతి పూజ జరిపి, శివున్ని షోడశోపచారములతో పూజించాలి. శివ పూజకు బిల్వ పత్రములు ఉపయోగించుట ఉత్తమము.  శ్రావణ సోమవారం పూజ జరిపిన తరువాత శివుని ఆలయమును సందర్శించటము మంచిదని చెప్పబడినది.

శ్రావణ సోమవార శివ పూజా విధానము

శ్రావణ సోమవార వ్రత విధానము PDF

శివ పూజ తరువాత కూడా వారు ప్రసాదము, పాలు, పండ్లు లాంటివే తీసుకోవాలి. ఉడికించిన ఆహారం తీసుకోరాదు. మరునాటి ఉదయం శివుడికి నైవేద్యం సమర్పించిన తరువాత మాత్రమే ఉపవాసమును ముగించాలి. 

0/Post a Comment/Comments

Previous Post Next Post