కేరళ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో ఏర్పడిన వరదల కారణంగా, ఇప్పటివరకూ 385 మంది మృతిచెందగా, దాదాపు 2.20 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. గత 100 సంవత్సరాలలో ఈ స్థాయి వరదలు రావటం ఇదే ప్రథమం.
వరదలతో అతలాకుతలమైన రాష్ట్రాన్ని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుతం 500 కోట్ల రూపాయల తక్షణ సహాయాన్ని ప్రకటించింది. ఇప్పటికే పలు రాష్ట్రాలు వరద సహాయాన్ని ప్రకటించాయి. తెలంగాణ ప్రభుత్వం 25 కోట్లతో పాటు, వరదల కారణంగా మంచినీటి కొరత ఏర్పడకుండా చేయటానికి 2.5 కోట్ల విలువైన నీటిశుద్ధి ప్లాంట్లను, 50 లక్షల విలువైన బాలల పౌష్టికాహారాన్ని విరాళంగా పంపింది. తమిళనాడు 5 కోట్ల సహాయాన్ని ప్రకటించగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున 10 కోట్ల సహాయాన్ని ప్రకటించారు.
దక్షిణాది సినీరంగ ప్రముఖులు కూడా భారీ విరాళాలు ప్రకటిస్తున్నారు. యూఏఈ వైస్ ప్రెసిడెంట్ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్టోమ్ సామాజిక మాధ్యమాలలో కేరళకు సహాయం అందించాల్సిందిగా పిలుపునిచ్చారు. ఆయన ఈ నిమిత్తమై ఒక కమిటీని ఏర్పాటు చేసారు. సహాయ మొత్తాన్ని త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.
Post a Comment