620 మంది 108 ఉద్యోగులపై వేటు

620 మంది 108 ఉద్యోగులపై వేటు
ఎనిమిది గంటల పాటు మాత్రమే పని చేస్తూ పాక్షిక సమ్మెలో పాల్గొంటున్న 620 మంది 108 ఉద్యోగులపై జీవీకే సంస్థ కఠిన చర్యలు తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర జీవీకే - ఇఎమ్ఆర్ఐ 108 సర్వీసెస్ స్టేట్ హెడ్ ఆఫీసర్ బ్రహ్మానందరావు ఉత్తర్వులు జారీ చేసారు. తెలంగాణా ప్రభుత్వం సలహాతోనే ఇంత భారీ నిర్ణయం తీసుకున్నట్లుగా భావిస్తున్నారు. 

అయితే కొంత మంది అభ్యర్థన మేరకు, సస్పెండైన వారిలో ఇవాళ కొత్త నిబంధనా నియమావళిపై సంతకం చేసే వారిని తిరిగి ఉద్యోగాల లోకి తీసుకుంటామని, ఆ వెసులుబాటు ఈ ఒక్క రోజుకు మాత్రమేనని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోలేనివారు సంస్థకు శాశ్వతంగా దూరమవుతారని హెచ్చరించారు. 108 ప్రభుత్వ ప్రయివేటు పార్ట్నర్‌షిప్‌ సంస్థ అనీ, ఈ పీపీపీ విధానాన్ని రద్ధు చేయాలన్న డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోదని బ్రహ్మానందరావు వివరించారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post