అమరావతి బాండ్లకు బీఎస్‌ఈలో భారీ స్పందన |
ఆంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతి బాండ్లకు స్టాక్ ఎక్ఛ్సేంజీలో భారీ స్పందన లభించింది. అమ్మకానికి ఉంచిన గంటలోనే ఒకటిన్నర రెట్ల బిడ్లు వచ్చాయి. దేశ చరిత్రలోనే రాజధాని నగర నిర్మాణం కోసం బాండ్లు జారీచేయటం ఇదే తొలిసారి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి (బీఎస్‌ఈ) లో ఇవాళ ఉదయం 11 గంటల నుంచి ఎలక్ట్రానిక్ బిడ్డింగ్ ద్వారా తొలివిడతలో 600 బాండ్లు విక్రయానికి అందుబాటులో ఉంచారు. 10 లక్షల పైబడిన విలువగల సంస్థాగత ఇన్వెస్టర్లకు మాత్రమే వీటిని అందుబాటులో ఉంచారు. 1300 కోట్ల విలువగల బాండ్లు జారీచేయగా 2000 కోట్ల రూపాయలకు పైగా బిడ్డింగ్ దాఖలైంది. ఎవరికి కేటాయించాలో ఈ సాయంత్రం లోపు సీఆర్‌డీఏ అధికారులు నిర్ణయిస్తారు.
మరిన్ని బాండ్లు జారీ చేయాలనే ఉద్దేశ్యంలో అధికారులు ఉన్నట్లు తెలుస్తుంది. సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీధర్ ఈ తతంగాన్ని తన కార్యాలయం నుండి పర్యవేక్షిస్తున్నారు.
Post a Comment