జీనోమ్ వ్యాలీలో బయోటెక్ హబ్

జీనోమ్ వ్యాలీలో బయోటెక్ హబ్
బయో ఫార్మా, బయో టెక్ రంగాల్లో పరిశోధనలకు ఊతమిచ్చేందుకు త్వరలో 60 కోట్ల ఖర్చుతో జీనోమ్ వ్యాలీలో బయోటెక్ హబ్ ఏర్పాటు చేయనున్నామని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కెటిఆర్ వెల్లడించారు. మంగళవారం బేగం పేట లోని క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ ఆయన ఈ విషయం వెల్లడించారు. ఈ హబ్ తో 40 వేల చదరపు అడుగుల లాబ్స్ తో పాటు అంకుర సంస్థల కోసం ఇంక్యుబేటర్ కూడా అందుబాటులోకి వస్తుందని ఆయన అన్నారు. 

ఇప్పటికే జీనోమ్ వ్యాలీలో 200 కన్నా ఎక్కువ కంపెనీలు తమ కార్య కలాపాలు కొనసాగిస్తున్నాయని ఆయన అన్నారు. దీనితో ఉమ్మడి ప్రయోగ శాలలు, ఉత్పత్తి వసతులు అందుబాటులోకి వస్తాయని భవిష్యత్తులో లైఫ్ సైన్సెస్ రాజధానిగా హైదరాబాద్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకోనుందని మంత్రి పేర్కొన్నారు. 

బి హబ్ లో భాగంగా స్కేల్‌అప్ ల్యాబ్, సెల్‌లైన్ డెవలప్‌మెంట్, క్లోన్‌సెలక్షన్, స్మాల్‌స్కేల్ ప్రొడక్షన్ అప్‌స్ట్రీమ్ - డౌన్‌స్ట్రీమ్ ప్రాసెస్, ప్రీ-క్లినికల్ టెస్టింగ్ లాంటి అనేక సౌకర్యాలు అందుబాటు లోకి రానున్నాయి.

0/Post a Comment/Comments

Previous Post Next Post