మిషన్ భగీరథ దీపావళికి


తెలంగాణాలో ఇంటింటికీ మంచినీరు అందించే పథకం మిషన్ భగీరథ ముందు అనుకున్నట్లుగా ఆగష్టు 15న కాకుండా దీపావళి రోజున ప్రారంభించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారు. పూర్తి స్థాయిలో పనులు కాకపోవటంతో మంగళవారం ప్రగతి భవన్ లో జరిగిన అధికారుల సమీక్షలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ సమయానికల్లా అన్ని పనులు పూర్తి చేసి సన్నద్ధమై ఉండాలని అధికారులను ఆదేశించారు. 

ఆగష్టు 15 మధ్యాహ్నం నుండి 799 ప్రాంతాల్లో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు అధికారులను ఆదేశించారు. అవసరమైన మందులు, ఇతర సామాగ్రి ముందుగానే గ్రామాలకు చేర్చాలని తెలిపారు. 

అలాగే తెలంగాణ రికార్డు స్థాయి విద్యుత్ వినియోగాన్ని తమ ప్రభుత్వ ఘనతగా సీఎం చెప్పుకున్నారు. తెలంగాణలో తలసరి విద్యుత్ వినియోగం జాతీయ సగటు కన్నా 33 శాతం ఎక్కువని, భవిష్యత్లో ఏ స్థాయి డిమాండ్ కైనా సన్నద్ధమై ఉన్నామని ఆయన అన్నారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post