బాబు క్రెడిబిలిటీ ఇంత తక్కువా?

బాబు క్రెడిబిలిటీ ఇంత తక్కువా?
అమరావతి బాండ్లు హాట్ కేకుల్లా అమ్ముయ్యాయని,  బాబు పేరే ఒక బ్రాండ్ అని నిన్నటి నుండి పత్రికలు, చానెళ్లు హోరెత్తించాయి. అయితే  మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ఈ విషయంపై కొన్ని ఆరోపణలు చేసారు. ఆ ఆరోపణలను స్టాక్ మార్కెట్ నిపుణులు పరిశీలించగా విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. 

స్టాక్ మార్కెట్లో ప్రభుత్వాలు బాండ్లను జారీ చేసి నిధులు సేకరించే ఆనవాయితీ ఎప్పటినుండో ఉంది. ప్రతి సంవత్సరం తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు కూడా ఇలా నిధులను సేకరిస్తూనే ఉన్నాయి. అయితే రాజధాని నిర్మాణం కోసం సేకరించటం మాత్రం ఇదే తొలిసారి. ఈ బాండ్లకు ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చింది. ప్రభుత్వాలే కాక నగర పాలక సంస్థలు కూడా ఇలా బాండ్ల ద్వారా నిధులు సేకరిస్తాయి. 

గత సంవత్సరం పూణే మునిసిపల్ కార్పొరేషన్ 7.59 వడ్డీ రేటు తో నిధులు సేకరించింది. ఈ సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన బాండ్ల వడ్డీ రేటు కూడా ఎనిమిది శాతానికి లోపుగానే ఉంది. అయితే గత వారమే లోటులో ఉన్న హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ జారీ చేసిన బాండ్లకు 8.9 నుండి 9.3 % వరకు వడ్డీ  చెల్లిస్తున్నారు. అయితే అమరావతి బాండ్లకు మాత్రం ఏకంగా 10.32 శాతం వడ్డీ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే మదుపుదారులు ఎక్కువ ఆసక్తి చూపారు. 

అత్యధిక వడ్డీ కావటం, ప్రభుత్వ గ్యారంటీ ఉండటం వలననే ఇది ఓవర్ సబ్స్క్రైబ్ అయింది.  బ్రాండ్ క్రెడిబులిటీ ఉన్న సంస్థలు తక్కువ వడ్డీకి అప్పు తీసుకోగలుగుతాయి. అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ల బ్రాండ్ క్రెడిబులిటీ అంత తక్కువా? అయితే ఇవి బాండ్లు కావనీ, రాబోయే కాలంలో ప్రజల పాలిట బ్యాండ్లు అని కూడా వ్యాఖ్యలు వినవస్తున్నాయి.  

0/Post a Comment/Comments

Previous Post Next Post