శ్రావణ శుక్ల పంచమిని నాగ పంచమిగా పిలుస్తారు. దీనికి గరుడ పంచమి అనే పేరు కూడా ఉంది. తన తల్లి దాస్య విముక్తి కోసం గరుడుడు ఈ పంచమి రోజున అమృత భాండాన్ని పొందాడు. అందుకే ఇది గరుడ పంచమి అయింది. అయితే ఈ రోజున జరిపే పూజంతా నాగ సంబంధమైనది కావటంతో నాగ పంచమి అనే పేరే ప్రాచుర్యంలో ఉంది.
నాగ పంచమి రోజున ఇంటి ద్వారానికి రెండువైపులా ఆవు పేడతో అలికి ముగ్గులతో సర్పాలను వేసి ఇంట్లో ఉన్న నాగ ప్రతిమను పంచామృతంతోనూ, లేత గరిక, దర్భ, సువాసన గల జాజి, సంపెంగ లాంటి పూలు, గంధం మొదలైన వాటితో పూజించాలి. నాగ పూజ వలన సర్ప దోషాలు నశిస్తాయి. సర్ప భయం ఉండదు. గర్భ దోషాలు నివారించబడతాయి. కండ్లకు, చెవులకు సంబంధించిన వ్యాధులు కూడా రావని చెబుతారు.
కొన్ని ప్రాంతాలలో నాగుల చవితి, నాగుల పంచమి రోజులలో కొన్ని పనులు చేయరు. అవి భూమిని దున్నటం, తవ్వకం పని, మట్టిని పారతో ఎత్తటం, పొలాల్లో కలుపు తీయటం, పెనం మీద రొట్టె కాల్చటం వంటివి.
Will Be Updated Soon.........
Post a Comment