ఆ రెండింటి మధ్య ఇరుక్కుపోయిన ఉన్నత విద్యామండలి


యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), మరియు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసిటిఇ) ల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఇరుక్కుపోయిందా? ఉన్నత విద్యా మండలి వర్గాలు ఔననే అంటున్నాయి. 

యూజీసీ నిబంధనల ప్రకారం కేటగిరి 1 లో అనుమతులు పొందిన డీమ్డ్ యూనివర్సిటీలకు ఆఫ్-క్యాంపస్ సెంటర్ను ప్రారంభించే అధికారం ఉంది. 2016 లో ఆ సంస్థ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం సాంకేతిక కోర్సులు ప్రారంభించటానికి డీమ్డ్ యూనివర్సిటీలు, ఏఐసిటిఇ అనుమతి తీసుకోవలసిన అవసరం లేదు. 

ఏఐసిటిఇ నిబంధనల ప్రకారం దేశంలోని అన్ని సాంకేతిక విద్యా కోర్సులకు అనుమతి ఉండాలి. వారు చెబుతున్న వివరాల ప్రకారం అన్ని సాంకేతిక విద్యా సంస్థలు, యూనివర్సిటీ కాలేజీలు కూడా తమ అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసారు. వారు ఈ మేరకు హైద్రాబాద్లో అనుమతి లేని విద్యా సంస్థలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాసారు. దీనితో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యామండలిని ఈ విషయంపై దృష్టి సారించమని కోరింది. 

యూజీసీ నిబంధనల ప్రకారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి, డీమ్డ్ యూనివర్సిటీల విషయంలో ఎటువంటి జోక్యం చేసుకోలేదు. అధికారులు ఈ విషయాన్నే ప్రభుత్వానికి నివేదించి, ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు.  

0/Post a Comment/Comments

Previous Post Next Post