వివాదాస్పద మత ప్రబోధకుడు జకీర్ నాయక్‌ను భారత్ కు అప్పగించేది లేదని, మలేషియా ప్రధాని మహతిర్ మొహమ్మద్ స్పష్టం చేశారు. మనదేశంలో అతనిపై ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలు మరియు విద్వేషపూరిత ప్రసంగం తదితర నేరారోపణలు ఉన్నాయి. వీటి నిమిత్తమై అతనిని విచారించాలని మనదేశం కోరుకొంటోంది.
డాక్టర్ జకీర్ నాయక్ 2016 లో ఇండియాను విడిచిపెట్టి, మలేషియాలో ఆశ్రయం పొందాడు. అతనికి అక్కడి ప్రభుత్వం శాశ్వత నివాస హక్కు (PR) కల్పించింది. నాయక్ అప్పగింతకై మన దేశ విదేశాంగ శాఖ గత జనవరిలో అధికారికంగా మలేసియా ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. అతనికి శాశ్వత నివాస హోదా ఇచ్చినందున, అతను ఏదైనా సమస్యను సృష్టిస్తే తప్ప, మేము అతనిని బహిష్కరించే అవకాశం లేదని మహతిర్ అన్నారు.
2016 లో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన దాడికి సంబంధించిన కేసు కూడా అతనిపై ఉంది. ఇవే కాక అతనిపై ఉన్న అక్రమాస్తులు, మనీ లాండరింగ్ లాంటి కేసులు కూడా ED దర్యాప్తు చేస్తోంది. అతని సంస్థ ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఐఆర్ఎఫ్) ను 2016 నుండి నిషేధించారు.
Post a Comment