కేసుల కేటాయింపు, ధర్మాసనాల ఏర్పాటులో భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) కి ఉన్న విశేష అధికారాలను ఎవరూ ప్రశ్నించజాలరని సుప్రీమ్ కోర్ట్ తేల్చి చెప్పింది. ఆయనే మాస్టర్ ఆఫ్ ది రోస్టర్ అని, ఆయనకు ధర్మాసనాలకు కేసులను కేటాయించే విచక్షణాధికారం ఉంటుందని ఈ మేరకు తీర్పులో స్పష్టం చేసింది.
కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి శాంతిభూషణ్ వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. కేసులను హేతుబద్ధంగా, పారదర్శకంగా కేటాయించేందుకు, ధర్మాసనాల ఏర్పాటుకు మార్గదర్శకాలను రూపొందించాలని ఆయన సూచించగా సుప్రీంకోర్టు కోర్టు కొట్టివేసింది. కోర్టు పాలనా వ్యవహారాలకు భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వం వహిస్తారని, ఆయనకు విశేషాధికారాలుంటాయని స్పష్టం చేసింది.
Post a Comment