నిన్ను టిఆర్ఎస్ నుండి తరిమేస్తారు

నిన్ను టిఆర్ఎస్ నుండి తరిమేస్తారు
టిఆర్ఎస్ పార్టీలో అంతర్గత పోరు జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో ఆ పార్టీనేతలు తలా ఒక మాట మాట్లాడుతున్నారని, కవిత ప్రత్యేక హోదాకు మద్ధతునిస్తుండగా , కెటిఆర్, హరీష్ రావులు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.  టిఆర్ఎస్ పార్టీలో యజమానులకు పనివాళ్లకు మధ్య పోరాటం జరుగుతుందని, త్వరలో హరీష్ రావును పార్టీ నుండి తన్ని తరిమేస్తారని వ్యాఖ్యానించారు. 

టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక హోదా పై తెలంగాణ కాంగ్రెస్ నాయకుల వైఖరి తెలుపమని అంటున్నారని, తమకు సీడబ్ల్యూసీ నిర్ణయమే శిలా శాసనమని, వారిలాగా తలో మాట మాట్లాడేది లేదని రేవంత్ అన్నారు.  కాంగ్రెస్ ఇచ్చిన మాటను తప్పదని, అందుకే తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిందని ఆయన అన్నారు. ఎంత కష్టమైనా, పార్లమెంట్‌ తలుపులు మూసి, లైవ్‌ కట్‌ చేసి బిల్‌ పాస్‌ చేసామని వివరించారు. తనపై 'రావు'లు ఎన్ని కేసులు పెట్టినా భయపడనని, తుది వరకు కెసిఆర్ దోపిడీని ప్రశ్నిస్తానని ఆయన అన్నారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post