టిఆర్ఎస్ కు ఓటు వేస్తే బిజెపి కి ఓటువేసినట్లే అని ఈ మధ్య కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ప్రకటనలకు ప్రతిగా రాష్ట్ర నీటి పారుదల శాఖా మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పార్టీ పై విమర్శలు చేసారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే తెలుగు దేశం పార్టీకి ఓటువేసినట్లేనని అన్నారు. ఆ పార్టీకి తెలంగాణా రాష్ట్ర ప్రయోజనాల పట్ల చిత్తశుద్ధి లేదని ఆయన మండిపడ్డారు.
విభజన బిల్లు సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా, తెలంగాణకు పారిశ్రామిక రాయితీలు కల్పిస్తామని అప్పటి ప్రధాని హామీ ఇచ్చారని, ఇప్పుడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో హోదా గురించి మాత్రమే తీర్మానం చేసారని హరీష్ అన్నారు. పోలవరానికి జాతీయ హోదాను కట్టబెట్టారని, కానీ తెలంగాణాలో ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వలేదని మండిపడ్డారు. తెలుగుదేశం ఎంపీలు పార్లమెంట్లో తెలంగాణ అప్రజాస్వామికంగా ఏర్పడింది అని మాట్లాడారని అయినా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మద్దతిచ్చారని అన్నారు.
Post a Comment