శాతకర్ణి వినోద పన్ను మినహాయింపు ఎవరికి?


గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వినోద పన్ను మినహాయింపు కల్పించటాన్ని సవాలు చేస్తూ న్యాయవాది ఆదర్శ్‌కుమార్‌ గత సంవత్సరం దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యం పై హైకోర్టులో విచారణ జరిగింది. ముఖ్య మంత్రి దగ్గరి బంధువు, ఎమ్మెల్యే బాలకృష్ణ హీరోగా ఉన్నందుకే ఈ మినహాయింపు ఇచ్చారని అప్పట్లో వార్తలు వచ్చాయి. 

ఆ చిత్రానికి ఇచ్చిన పన్ను మినహాయింపు లబ్ధి ప్రేక్షకుడికా? సినీ నిర్మాతకా? తెలపాలని ప్రభుత్వానికి, సినీ నిర్మాతకు కోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రేక్షకుల కోసం ఉద్దేశించిన ఈ మినహాయింపును ప్రభుత్వం, నిర్మాతల కోసం దుర్వినియోగం చేస్తుందని పిటిషనర్ వాదించారు. తదుపరి విచారణ ఆగష్టు 16న జరగనుంది. 

0/Post a Comment/Comments

Previous Post Next Post