వైసిపికి బంద్ నిర్వహించే నైతిక హక్కు లేదు

వైసిపికి బంద్ నిర్వహించే నైతిక హక్కు లేదు
రాష్ట్ర అభివృద్ధికి అడ్డు పడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి   (వైఎస్ఆర్సీపీకి)  రాష్ట్ర వ్యాప్త బంద్ ను నిర్వహించే  నైతిక హక్కు లేదని రాష్ట్ర ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్య అన్నారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పై వ్యతిరేక వ్యాఖ్యలు చేయవసి వస్తుందనే ఆ పార్టీ ఎంపీలు, తమ సభ్యత్వాలకు రాజీనామా చేసారని ఆయన ఆరోపించారు.  

ప్రతిపక్ష నేత అయిన జగన్, మోడీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. ఆ పార్టీ ఎంపీలు రాజీనామా చేయాలని మోడీ కోరితేనే వారు రాజీనామా చేసి ఆంధ్రప్రదేశ్ కోసం చేసినట్లుగా చెప్పుకుంటున్నారు అని వ్యాఖ్యానించారు. జన సేన అధ్యక్ష్యుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ సినిమా హీరోలందరూ ముఖ్యమంత్రులు కాలేరని తెలుసుకోవాలని ఆయన ఎద్దేవా చేసారు. ఈ విలేఖరుల సమావేశంలో వర్ల రామయ్యతో పాటు స్థానిక ఎమ్మెల్యే సుగుణ, తుడా చైర్మన్ నర్సింహా యాదవ్ పాల్గొన్నారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post