వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సిపి) లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాను నిరాకరించినందుకు, నిరసనను వ్యక్తం చేయటంలో భాగంగా మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది. జన సేన, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు ఈ బంద్ కు దూరంగా ఉండనున్నాయి.
వైసిపి నాయకుడు మల్లాది విష్ణు మాట్లాడుతూ, ఈ బంద్ కు రాజకీయ పార్టీలకు అతీతంగా అందరినుండి సహకారం లభించనున్నట్లు తెలిపారు. దీని ద్వారా రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను కేంద్ర ప్రభుత్వానికి తెలిసేలా ప్రతి ఒక్కరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేసారు. అందరం కలిసి కేంద్రంపై ఒత్తిడి చేస్తేనే ప్రత్యేక హోదా సాధించగలమని ఆయన అన్నారు. ఈ బంద్ కు మద్దతు తెలుపుతున్న ప్రజా సంఘాలకు ఆయన ధన్యవాదాలు తెలియచేసారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏకాభిప్రాయ సాధన పేరిట ఇప్పుడు అంతా అయిపోయాక అఖిల పక్షాన్ని నిర్వహించటం నిరర్థకమని విష్ణు అన్నారు. ఇంతకాలం అసలు ఇతర పక్షాలను పట్టించుకోలేదని, ఎన్నికలు దగ్గరకురావటం, ప్రత్యేక హోదా సాధించటంలో విఫలం కావటంతోనే తమ అసమర్థతను ఇతరులకు అంటగట్టడానికే ఈ అఖిల పక్షమని ఆయన మండిపడ్డారు.
Post a Comment