ఇవాళ పోలవరం అనుమతుల విషయమై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో కీలక ప్రకటన చేసింది. తమ ప్రశ్నలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంతృప్తికరమైన సమాధానాలు ఇచ్చిన తరువాతే కేంద్ర ప్రభుత్వ అనుమతులు లభిస్తాయని తేల్చి చెప్పింది.
రాజ్య సభలో కేవీపీ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మెహ్వాల్ ఈ విధంగా సమాధానమిచ్చారు. సవరించిన అంచనాలపై కేంద్ర జలసంఘం వివరణలు కోరిందని, సంతృప్తికరమైన సమాధానాల కోసం వేచి చూస్తున్నామని ఆయన తెలిపారు.
2010-11 లో అంచనాలు 16101 కోట్లు ఉండగా, అవి ఏకంగా 58,319 కోట్లకు పెంచటం, ప్రాజెక్టు ఎత్తు పెంచకున్నా ముంపునకు గురయ్యే ఎకరాలు పెరగటం, ప్రభావితమయ్యే కుటుంబాల సంఖ్య రెట్టింపు కన్నా ఎక్కువగా పెరగటం, హెడ్ వర్క్స్ లో డిజైన్ మార్చి కాంట్రాక్టరుకు అనుచితమైన ప్రయోజనాన్ని కలిగించటం, ప్రయోజనం లేకున్నా కుడి, ఎడమ కాలువల డిజైన్లు మార్చటం లాంటి తీవ్ర ఆరోపణలు కేంద్ర జల సంఘం నుండే వచ్చాయి.
Post a Comment