మాది పొత్తు - వైసిపిది కుమ్మక్కు

మాది పొత్తు - వైసిపిది కుమ్మక్కు
అవినీతి కేసుల నుండి బయటపడటానికి వైసిపి అధినేత జగన్, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తో కుమ్మక్కయ్యారని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖా మంత్రి దేవినేని ఉమా మహేశ్వర్ రావు ఆరోపించారు. బిజెపితో కలిసి రహస్యంగా రాష్ట్ర ప్రజలకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని, అందుకే అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయాల్సి వస్తుందనే తన ఎంపీలతో ముందే రాజీనామా చేయించారని కూడా అన్నారు. ఇప్పుడు బంద్ కు, నిరసనలకు పిలుపునివ్వడం ద్వారా ప్రజలను మరింత మోసం చెయ్యాలని ప్రయత్నిస్తున్నాడని వ్యాఖ్యానించారు. 

టిడిపి సరైన దశలో ముందుకు వెళ్తుందని, కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తుందని నాలుగు సంవత్సరాలు వారితో పొత్తు పెట్టుకుని ఎదురు చూసామని, ఇవ్వకపోవటంతోనే ఇప్పుడు పోరాడుతున్నామని అన్నారు. ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంట్లో చేసిన ప్రసంగం పై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post