కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయాన్ని దేశం మొత్తానికి తెలియజేసేందుకు ఉద్దేశించిందని ఉప ముఖ్యమంత్రి కె.ఇ. కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడుతూ అన్నారు. తెలుగు దేశం పార్టీ కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి పొత్తు కుదుర్చుకోలేదనీ, ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవటం తమను దెబ్బతీస్తుందని తెలుసని ఆయన అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి చెందిన శాఖ మాత్రమేనని అభిప్రాయం వెలిబుచ్చారు.
జులై 24వ తేదీన ప్రతిపక్ష పార్టీ ఇచ్చిన బంద్ పిలుపును తాము సమర్థించడం లేదని కె.ఇ. కృష్ణమూర్తి తెలిపారు. అవిశ్వాసం పై చర్చ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రధాని ప్రయత్నించారని తీవ్ర ఆరోపణ చేసారు. తమ ప్రభుత్వం ప్రత్యేక హోదా పై ఎప్పుడూ U-టర్న్ తీసుకోలేదని కూడా తెలియచేసారు.
Post a Comment