ఒకప్పుడు చాటింగ్ అంటే యాహూ మెసెంజర్ అనే అర్థం వచ్చేది. కొన్నేళ్ల పాటు మెయిల్, మెసెంజర్ సర్వీసుల్లో అగ్రస్థానాన్ని అలంకరించిన యాహూ ఇప్పుడు యూజర్లను కోల్పోయి కష్టాల్లో ఉంది. ఈ సంస్థ ఇవాల్టి నుండి మెసెంజర్ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
యాహూ మెసెంజర్ సేవలు 1998 లో ప్రారంభమైయ్యాయి. చాలామంది ఈ సేవలు ఆపివేయటం బాధాకరమని ట్వీట్లు చేస్తున్నారు. దీనితో తమకు ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకుంటున్నారు. అయితే మెసెంజర్ లో ఉన్న డాటాను ఆరు నెలల లోపల డౌన్లోడ్ చేసుకోవలసి ఉంటుందని, ఆ తర్వాత అది అందుబాటులో ఉండదని సంస్థ ప్రకటించింది. త్వరలో స్కిరిల్ పేరుతొ కొత్త మెసెంజర్, సోషల్ మీడియా ఆప్ ను ఈ సంస్థ విడుదల చేయనుంది.
Post a Comment