కాంగ్రెస్ తరపున అవిశ్వాస తీర్మానం

కాంగ్రెస్ తరపున అవిశ్వాస తీర్మానం
ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఊమెన్ చాందీ  మాట్లాడుతూ పార్లమెంటు సమావేశాల్లో ప్రత్యేక కేటగిరీ హోదా (ఎస్సిఎస్) కోసం కాంగ్రెస్ పార్టీ తరపున  అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. వచ్చే 2019 ఎన్నికలలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రత్యేక హోదా ఇస్తుందని తెలియచేసారు. 

ఆంధ్రప్రదేశ్లో పార్టీ గత వైభవాన్ని తిరిగి పొందుతుందని, ఎన్డీయే ప్రభుత్వంతో ప్రజలందరూ విసుగు చెందారని, కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావటాన్ని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలోని నాయకులు మరియు కార్యకర్తల అభిప్రాయం మేరకు కాంగ్రెస్ పార్టీ మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు సొంతంగా పోటీ చేస్తుందని చాందీ అన్నారు. 

మేము పార్టీ తరపున 44,000 బూత్-స్థాయి కమిటీలను ఏర్పాటు చేయబోతున్నాం. అక్టోబర్ 2 (గాంధీ జయంతి) నుండి ఇంటింటికీ ప్రచారం చేయనున్నామని, ఇది మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జయంతి అయిన నవంబర్ 19 న ముగియనుందని ఆయన వివరించారు. 

0/Post a Comment/Comments