ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో తాను ఏడ్చిన మాట నిజమేనని, కానీ తాను ఎందుకు ఏడ్చానో మీడియా తప్పుగా అర్థం చేసుకుందని కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామి అన్నారు.
అధికార పీఠం దక్కినా తాను ఏమాత్రం సంతోషంగా లేనని తాను అన్న మాట నిజమేనని అయితే ఇందులో ఎక్కడా కాంగ్రెస్ పార్టీని గురించి కానీ, ఆ పార్టీ నాయకులను గురించి కానీ మాట్లాడలేదని ఆయన వివరణ ఇచ్చారు.
నేను రైతుల కష్టాలు నిర్మూలించాలన్న లక్ష్యంతోనే వారికి రుణమాఫీ ప్రకటించాను. ఇప్పుడు అది ఆర్థికంగా పెనుభారమైంది. ఈ పథకానికి డబ్బుల కోసం ప్రజలపై పన్నుల భారాన్ని మోపాను. నా పరిస్థితి గరళాన్ని మింగిన శివుడిలా మారింది. తను సంతోషంగా లేను అన్నది ప్రజలపై ఆర్థిక భారం మోపడం గురించని ఆయన వివరణ ఇచ్చారు.
Post a Comment