ఆమెను ఒలింపిక్ పోడియంపై చూడాలని ఉంది.

ప్రపంచ ఛాంపియన్‌‌షిప్‌లో 400 మీటర్ల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన స్ప్రింటర్ హిమదాస్‌ ను అందరూ ఒలింపిక్ పోడియం పై చూడాలనుకుంటున్నారని ఆనంద్ మహీంద్రా అన్నారు. రాజ్య వర్ధన్ సింగ్ రాథోర్ మరియు అథ్లెటిక్ ఫెడరేషన్ అఫ్ ఇండియా లోని వ్యక్తులు ఆమెకు కావాల్సిన శిక్షణ, మరియు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ ఆమెకు ప్రభుత్వ సహాయమే కాకుండా ఇతరత్రా ఆర్ధిక సహాయం ఏమైనా కావలిస్తే చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. అని మహీంద్రా సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

అస్సాంలోని ఓ గ్రామంలో సామాన్య రైతు కుటుంబం లో జన్మించిన హిమపై ఇప్పుడు ప్రశంసలు కురుస్తున్నాయి. తమ రాష్ట్రానికి ఎంతో పేరు తీసుకువచ్చిన ఆమెకు ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ 50 లక్షల నజరానా ప్రకటించారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర శ్రీ సిద్ధార్థ అకాడమీ నుండి 10 లక్షల బహుమతి ప్రకటించారు. అంతేకాకుండా 2020 టోక్యో ఒలింపిక్స్ వరకూ ఆమెకు అవసరమయ్యే ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం తరపున అందిస్తామని పేర్కొన్నారు. 


0/Post a Comment/Comments

Previous Post Next Post