మోడీ కేర్ - తెలంగాణ డోంట్ కేర్

మోడీ కేర్ - తెలంగాణ డోంట్ కేర్
ఆయుష్మాన్‌ భారత్‌ ను ప్రవేశ పెట్టే సమయంలో నరేంద్ర మోడీ దీనిని ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య పథకంగా అభివర్ణించారు. మోడీ కేర్ గా పేరున్న ఈ పథకంలో భాగమవటానికి తెలంగాణ రాష్ట్రం ఆసక్తిని చూపడం లేదు. తమిళనాడు రాష్ట్రం కూడా ఇప్పటికే నో చెప్పింది. ఆంధ్ర ప్రదేశ్ ఈ పథకంలో చేరి ఆగష్టు 15న ప్రారంభించటానికి సిద్ధమైంది. 

ఈ పథకంలో కేంద్ర నిబంధనలు కఠినంగా ఉండటం వలన తెలంగాణాలో కేవలం 26 లక్షల మంది లబ్ధిదారులుగా ఉండనున్నారు. వీరికి మొత్తం 354 కోట్లు ఖర్చు కానుంది. నిబంధనల ప్రకారం 60% ఖర్చు అంటే 212 కోట్లు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. కానీ ఇప్పటికే అమలులో ఉన్న ఆరోగ్య శ్రీ పథకం లో భాగంగా మరింత ఎక్కువ మందికి 700 కోట్లకు పైగా ఖర్చుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రయోజనం కల్పిస్తోంది. 

కేంద్ర నిబంధనల ప్రకారం ఈ పథకంపై మోడీ బొమ్మ ప్రముఖంగా ఉండాలి. అంటే కెసిఆర్ బొమ్మ కన్నామోడీ బొమ్మ పెద్దగా ఉండాలి. కేవలం 212 కోట్ల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని భాగస్వామిగా చేసి ఆరోగ్యశ్రీ కార్డు పై ఆయన బొమ్మ వేసి, ఇన్ని సంవత్సరాలుగా రాష్ట్రం కొనసాగిస్తున్న పథకం క్రెడిట్ ను ఎన్నికల ముందు మోడీకి ఇవ్వటం ఎందుకని తెలంగాణ ప్రభుత్వం దీనిని పక్కన పెట్టింది. 

ఈ పథకం తెలంగాణాలో అమలవుతున్న ఆరోగ్యశ్రీని ఆధారం చేసుకునే ప్రవేశపెట్టబడింది. దీనిలో ఆరోగ్య మిత్రలు ఉంటే అక్కడ ఆయుష్మాన్ మిత్రలు ఉంటారు. సాఫ్ట్ వేర్ కూడా ప్రస్తుతానికి తెలంగాణ సహాయంతోనే వాడనున్నారు. 

ఆగష్టు 15 నుండి కేంద్రప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించనున్న ఈ పథకం, ఆరోజు దాదాపు సగం రాష్ట్రాలలో ప్రారంభం కావటం లేదు. ఉత్తరాది రాష్ట్రాలలో ఈ పథకం ప్రారంభించటానికి అవసరమైన ఏర్పాట్లు చేయటం ఆలస్యం అవటం వల్ల కొన్ని అవి రోజులు ఆలస్యంగా ప్రారంభించనున్నాయి. కాగా, దక్షిణాది రాష్ట్రాలలో ఇంతకన్నా మెరుగైన పథకాలు ఇప్పటికే అమలులో ఉన్నాయి. శస్త్ర చికిత్సల ఖర్చు కూడా ఆరోగ్యశ్రీ కన్నా బాగా తక్కువగా ఉండటం వల్ల ఆసుపత్రులు కూడా ఈ పథకం పై ఆసక్తిని చూపడం లేదు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post