కత్తి మహేష్ మళ్ళీ అరెస్ట్

ఈ సారి కత్తి మహేష్ ను అరెస్ట్ చేసే వంతు చిత్తూరు జిల్లా పోలీసులకు వచ్చింది. పీలేరులో ఏర్పాటు చేయ తలపెట్టిన ప్రెస్ మీట్ ను అడ్డుకుని ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మళ్ళీ ఉద్రిక్తతలు తలెత్తుతాయనే  ఈ విధంగా చేసినట్లు పోలీసులు తెలిపారు. ముందుగా ఆయనను మదన పల్లెకు, తిరిగి అక్కడ నుండి బెంగళూరుకు తరలించినట్లు తెలిసింది. 

కత్తి మహేష్ హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరామునిపై అనుచిత వ్యాఖ్యలు చేయటంతో ఆయనను ఆరు నెలల పాటు హైదరాబాద్ నుండి బహిష్కరించిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా ఆయనను స్వగ్రామమైన యర్రావారిపాళెం మండలం యల్లమందలో విడిచిపెట్టారు.

కత్తి మహేష్ అరెస్టుపై ఆయన కుటుంబ సభ్యులు నిరసన వ్యక్తం చేసారు. కేవలం ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తే ఎందుకు అరెస్ట్ చేసారని ప్రశ్నించారు. ఇది ప్రాథమిక హక్కైన భావ ప్రకటనా స్వేఛ్ఛకు విఘాతం కలిగించటమేనని ఆరోపించారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post