క్రిప్టో కరెన్సీ లావాదేవీలపై ఆర్బీఐ నిషేధ ప్రభావం ఎంత?

క్రిప్టో కరెన్సీ లావాదేవీలపై ఆర్బీఐ నిషేధ ప్రభావం ఎంత?
బిట్‌కాయిన్‌ మరియు అన్ని ఇతర క్రిప్టోకరెన్సీల లావాదేవీలపై ఆర్బీఐ విధించిన నిషేధం ఐదవ తేదీ అర్ధరాత్రి నుండి అమల్లోకి వచ్చింది. అయితే ఈ నిషేధం కేవలం బిట్‌కాయిన్‌ను భారతీయ కరెన్సీలోకి మార్చడంపై మాత్రమే ప్రభావం చూపగలుగుతుంది. ఒకరి వాలెట్ నుండి మరొకరి వాలెట్లలోకి బిట్‌కాయిన్‌ మరియు ఇతర క్రిప్టో కరెన్సీలను పంపించుకోవటాన్ని ఏమాత్రం నిరోధించలేదు. ఈ డిజిటల్ కరెన్సీలు తమ లావాదేవీలకోసం బ్లాక్ చైన్ టెక్నాలజీలు వాడుతుండటం, వీటికి కేంద్రీకృత వ్యవస్థ అంటూ ఏదీ లేకపోవటం తో  వీటిని ఏ ప్రభుత్వం పూర్తిగా నియంత్రించజాలదు.  

అయితే ఈ నిషేధం బిట్‌కాయిన్‌ నుండి రూపాయల్లోకి మార్చుకునే సౌలభ్యం కల్పించే కంపెనీలైన యునో కాయిన్, జెబ్ పే లాంటి భారతీయ సంస్థలపై తీవ్ర ప్రభావం చూపనుంది. వాటి లావాదేవీలు దాదాపుగా నిలిచిపోనున్నాయి. అవి క్రిప్టో ఎక్స్చేంజ్ లు గా మారే ప్రయత్నం చేస్తున్నాయి. 

ఇప్పటికీ బిట్‌కాయిన్‌లు కలిగి ఉన్నవారు పేపాల్, నెటెల్లర్ మరియు స్క్రిల్ వంటివి ఉపయోగించి వాటిని రూపాయాల్లోకి మార్చుకునే సౌలభ్యం ఉంది. లోకల్ బిట్‌కాయిన్‌ లాంటి ఎక్స్చేంజిలు కూడా దీనికి ఉపయోగపడుతాయి.  క్రిప్టో లావాదేవీలు నిర్వహించేవారు పెద్దగా చింతించవలసిన అవసరం లేదు. అంటే మన ప్రభుత్వానికి పన్నులు చెల్లించి రూపాయల్లోకి మార్చుకునే సౌలభ్యం కల్పిస్తున్న సంస్థలు మాత్రమే ఈ నిషేధానికి ప్రభావితమవుతున్నాయి. 

0/Post a Comment/Comments

Previous Post Next Post