గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కు కూడా పాంక్రియాటిక్ క్యాన్సర్ ఉన్నట్లు పరీక్షల్లో బయటపడింది. అయితే ఆయన కొద్దిరోజుల పాటు అమెరికాలో చికిత్స తీసుకుని కొంతవరకు కోలుకున్నారు. ఇటీవలే ఆయన అమెరికానుంచి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే.
ప్రముఖ కథానాయిక సోనాలీ బింద్రే కూడా తాను మెటాస్టేటిక్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు వెల్లడించటంతో క్యాన్సర్‌పై పారికర్ మాట్లాడారు. ఆయన 'నాకు పాంక్రియాటిక్ కాన్సర్ అని వైద్యులు బయటపెట్టగానే నాలో ఒక రకమైన ఆందోళన కలిగింది. నా కుటుంబ సభ్యులు కూడా ఎంతో భయపడ్డారు. కానీ నేను మాత్రం దైర్యంగా ఉన్నాను. నేనో రాష్ట్రానికి నాయకుడిని. నేను దృఢంగా ఉండగలిగితేనే నా రాష్ట్రానికి , నన్ను ఆదర్శంగా తీసుకునే వాళ్లందరికీ న్యాయం చేయగలుగుతాను. అందుకే నేను భయపడలేదు. అంతేకాకుండా నా మనోబలం, ఆత్మస్థైర్యం తో ఈ వ్యాధి నుండి బయట పడగలిగాను. క్యాన్సర్ వ్యాధి ఉన్న వాళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒత్తిడికి గురి కాకూడదు. నేను కూడా ఇదే సూత్రాన్ని పాటించాను. కాబట్టే కొంత ఉపశమనం పొందగలిగాను.’ అని అన్నారు.
సోనాలి కూడా గొప్ప ధైర్యవంతురాలు కాబట్టే తన వ్యాధి గురించి బయట పెట్టగలిగారు. ఆమె అలా పోరాడతాను అని చెప్పడం అభినందనీయం అని కూడా పారికర్ అన్నారు.
Post a Comment