అవిశ్వాసానికి మేము మద్దతివ్వం - పళని స్వామి

అవిశ్వాసానికి మేము మద్దతివ్వం - పళని స్వామి
కావేరి జలాల విషయంలో తమకు మద్దతివ్వనందుకు నిరసనగా, ఇప్పుడు తెలుగు దేశం పార్టీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి తాము మద్దతిచ్చే ప్రసక్తే లేదని తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి తేల్చి చెప్పారు. లోక్ సభలో అన్నాడీఎంకే కు 37 మంది సభ్యులున్నారు. 

మాకు అన్యాయం జరిగినప్పుడు అడిగినా ఎవరూ స్పందించలేదని, ఒంటరిగా పోరాడవలసి వచ్చిందని వాపోయారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగిందని మా మద్దతు అడుగుతున్నారు అని వ్యాఖ్యానించాడు. టిడిపి నాయకులు ఆపాయింట్మెంట్ అడిగితే వారిని కలవటానికి ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నిరాకరించారు. కాగా అన్నాడీఎంకే, బిజెడిలు రేపు ఓటింగ్ నుండి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.  

0/Post a Comment/Comments