అష్టానికా విధానము

అష్టానికా విధానము
అష్టానికా విధానము జైన మత ఆచారాల్లో ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. దీనిని పురాతన కాలం నుండి వీరు పాటిస్తూ వస్తున్నారు. జైన మత వ్యాపకుడైన మహావీరున్ని, హిందూ దైవమైన శ్రీ మహా విష్ణువు అవతారంగా భావిస్తారు. అందువల్ల అష్టానికా విధాన పద్ధతులను హిందువులు కూడా పవిత్రమైనవిగా భావిస్తారు. 

అష్టానిక అనేది జైనులు ఆచరించే ప్రత్యేక పూజా విధానము. రవిసేనాచార్యులు రచించిన పద్మపురాణంలో అష్టానిక విధి విధానాలు పొందుపరచబడి ఉన్నాయి. 

జైనుల్లో ఉన్న రెండు వర్గాలకు, శ్వేతాంబరులు మరియు దిగంబరులు ఇద్దరికీ  అష్టానికా విధానము ప్రముఖమైనదే.  ఈ అష్టానికా ప్రతి నాలుగు నెలలకొకసారి ఎనిమిది రోజులపాటు జరుగుతుంది. కార్తీక, ఫల్గుణ మరియు ఆషాఢ మాసాలలో ఇది జరుపుకుంటారు. ఆ మాసాలలో పౌర్ణమికి ఏడు రోజుల ముందు ప్రారంభమై పౌర్ణమి రోజు ముగుస్తాయి. ఆషాఢ మరియు ఫల్గుణ మాసాలలో జరుపుకునే అష్టానికను నందీశ్వర అష్టానికగా సంబోధిస్తారు. ఈ ఆచారాన్ని పాటించటం వలన ఆధ్యాత్మిక అంతర్దృష్టి మరియు జ్ఞానం  మెరుగుపడుతుందని భావిస్తారు. 

ఈ భూమండలంలో ఎనిమిది ద్వీపాలు, 52 జైన మందిరాలు ఉన్నట్లుగా జైనులు భావిస్తారు. ఎనిమిదవ ద్వీపాన్ని నందీశ్వర ద్వీపంగా పిలుస్తారు.  మందిరాలు దేవతలకు ప్రత్యేకించినవి. మనుష్యులకు ప్రవేశం నిషిద్ధం. నందీశ్వర ద్వీపం అంజనా పర్వతం, దధీముఖ పర్వతం మరియు రటేకర పర్వతం అనబడే మూడు పర్వతాలచే పరివేష్టించబడి ఉంటుంది. ఈ మూడు పర్వతాలపై మందిరాలు కూడా ఉన్నాయని భావిస్తారు. 

ఆషాఢ మాసము నుండి కార్తీక మాసము వరకు రుతుపవన కాలం కావటం వలన వృక్ష మరియు జంతు జాతులకు నష్టం కలగకూడదని జైన సన్యాసుల సంచారాన్ని నిషేధించారు. ఈ సమయంలో వారు ఒకే ప్రదేశంలో ఉండి ప్రార్థన కోసం ఈ సమయాన్ని వెచ్చిస్తారు. ఈ సమయాన్ని చౌదస చాతుర్మాసగా పిలుస్తారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post