టీడీపీది జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర - చంద్రబాబు

టీడీపీది జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర - చంద్రబాబు
అవిశ్వాస తీర్మానం వీగిపోయిన తర్వాత ఢిల్లీ వచ్చిన చంద్రబాబు, దేశంలో ప్రాంతీయ పార్టీలు బలోపేతం కావలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఆయన ఇక్కడ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ తెలుగు దేశం పార్టీ జాతీయ రాజకీయాలలో ప్రముఖ పాత్ర పోషిస్తుందని, కానీ తాను ఏ జాతీయ పదవికి పోటీ పడబోనని ఆయన అన్నారు. అది మమతా బెనర్జీ టీఎంసీ కావచ్చు. అఖిలేష్ సమాజ్ వాదీ కావచ్చు. కానీ దేశంలో ప్రాంతీయ పార్టీలు బలపడటం దేశ భవిష్యత్తు దృష్ట్యా అత్యవసరమని, ఆయన అన్నారు. 

అవిశ్వాసం పై చర్చకు ముందే బీజేడీ వాక్ అవుట్ చేయటం, అన్నా డీఎంకే ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయటం పై స్పందిస్తూ, తాను  ఆ పార్టీల పట్ల కినుక వహించేవాడిని కాదని అన్నారు. ప్రాంతీయ పార్టీలకు వారి వారి రాష్ట్ర అవసరాలను బట్టి పోరాడాల్సి రావటం గానీ, మద్దతివ్వవలసి రావటం గానీ ఉంటుందని, తాను ఇప్పుడు పోరాడుతున్నానని ఆయన వివరించారు. 

పదిహేనేళ్ల తరువాత ప్రతిపక్షాలతో అవిశ్వాసం ప్రవేశపెట్టబడింది. వారు మెజారిటీ కలిగి ఉన్నారని మాకు తెలుసు. ఇది మెజారిటీకి, మొరాలిటీకి (నైతికతకు) మధ్య పోరాటమని చంద్రబాబు అన్నారు. తన పార్టీ యొక్క భవిష్యత్ కార్యాచరణను ఇంకా ఏమీ నిర్ణయించలేదని, పార్లమెంట్ సభ్యులతో సమావేశమైన తర్వాత నిర్ణయిస్తామని తెలిపారు. తమ డిమాండ్లు నెరవేరనందున పార్లమెంట్లో నిరసనలు కొనసాగుతాయని ఆయన తెలియజేసారు. 

కేంద్ర మంత్రివర్గం నుండి వైదొలగిన తర్వాత ఫోన్లో సంభాషించినప్పుడు మోడీ మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ ట్రాప్ లో పడుతున్నారని మోడీ అన్నారని, కానీ నేను నిజాయితీతో ఉన్నాను. శుక్రవారం రోజు టిడిపి పార్లమెంట్లో అవిశ్వాసం ప్రవేశపెట్టినప్పుడు ఆ పార్టీ నేత కోర్టులో ఉన్నాడు అని అన్నారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post