వారికి ఇస్తే మాకూ ప్రత్యేక హోదా కావాలి

వారికి ఇస్తే మాకూ హోదా కావాలి
ఒకవేళ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తే తమకూ ప్రత్యేక హోదా కావాలని అవిశ్వాసం సందర్భంగా డిమాండ్ చేయాలని టిఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. తమకు కేటాయించిన సమయంలో విభజన చట్టం ప్రకారం తమకు రావాల్సిన వాటిపై కేంద్రాన్ని నిలదీయాలని, ప్రత్యేక హైకోర్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని లక్ష్యం చేసుకోవాలని నిర్ణయించింది. అయితే ఓటింగ్ విషయంలో మాత్రం ఈ పార్టీ తటస్థంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. 

టిఆర్ఎస్ పార్టీ ఎంపీ వినోద్ మాట్లాడుతూ నాలుగు సంవత్సరాల పాటు కేంద్రంలో తెలుగుదేశం భాగస్వామి. కేంద్రం చేసిన పనులకు వారు కూడా బాధ్యత వహించవలసి ఉంటుంది. నాలుగు సంవత్సరాలు వాళ్లిద్దరూ కలసి ఉండి, మమ్మల్ని నష్టపరిచే కొన్ని నిర్ణయాలు తీసుకుని, ఇవాళ మేము కేంద్రాన్ని వ్యతిరేకిస్తున్నాం. మీరు కూడా వ్యతిరేకించాలి అనగానే మేము వ్యతిరేకించాలా ? మేము మా రాష్ట్ర ప్రయోజనాలను బట్టి నిర్ణయం తీసుకుంటాము. ఈ అవిశ్వాసం ఓటింగ్ వరకు వెళ్తుందని మేము భావించట్లేదు అని వ్యాఖ్యానించారు. 

కాగా బీజేడీ, టీఎంసీ లు కూడా తమ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా డిమాండ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ డిమాండ్లన్నీ ఆంధ్ర ప్రదేశ్ కు ప్రతికూలంగా పరిణమించవచ్చు. ఇక బిజెపి అనుకున్నట్టుగానే రాష్ట్ర అసెంబ్లీలో ప్రత్యేక ప్యాకెజీకి అనుకూలంగా తెలుగుదేశం నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పంపిన తీర్మానంతో పాటు ఇతర సందర్భాలలో రాష్ట్రం నుండి వచ్చిన లేఖలను, చంద్రబాబు వివిధ సందర్భాలలో మాటలను ఈ సందర్భంగా ప్రస్తావించనుంది.  

0/Post a Comment/Comments

Previous Post Next Post