విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని కేంద్ర హోం శాఖ ఇవాళ సుప్రీమ్ కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొంది. ఈ సంవత్సరం మార్చ్ 12న జరిగిన సమీక్షా సమావేశంలోనే రైల్వే అధికారులు ఈ విషయాన్ని స్పష్టం చేసారని తెలిపింది.
విభజన చట్టంలోని పదో షెడ్యూల్లో పేర్కొన్న ఆస్తులను కూడా పంచవలసిన అవసరం లేదని కేంద్ర హోమ్ శాఖ కోర్టుకు తెలిపింది. కేంద్రం నూతన మెట్రో చట్టాన్ని తీసుకువచ్చిందని, దానికి అనుగుణంగా ఉంటేనే విజయవాడ మెట్రోకు అనుమతిస్తామని కూడా కేంద్ర హోమ్ శాఖ స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 15 వేల కోట్ల రూపాయలకు యుటిలైజేషన్ సర్టిఫికెట్లు సమర్పించిందని కూడా తెలిపింది.
ఇంకా కొన్ని విభజన అంశాలు పెండింగులో ఉన్నాయని, వివిధ శాఖలకు సంబంధించిన 753 మంది ఉద్యోగుల విషయం ఇంకా తేలలేదని, అనేక సంస్థల ఏర్పాటు కూడా డీపీఆర్, ఆమోదం దశల్లోనే ఉన్నాయని పేర్కొంది. చాలా అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం లేకపోవటం వలననే ఈ జాప్యం జరుగుతోందని కోర్టుకు హోమ్ శాఖ వెల్లడించింది.
Post a Comment