తెలుగు నటుడు వినోద్ మృతి

తెలుగు నటుడు వినోద్ మృతి
ప్రముఖ తెలుగు నటుడు వినోద్ ఇవాళ ఉదయం మూడు గంటలకు బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా మరణించారు. ఆయన అస‌లు పేరు అరిశెట్టి నాగేశ్వ‌ర్రావు. ఆయనకు భార్య వీణావతి మరియు  పిల్లలు శిరీష, సురేష్‌, తేజస్విలు ఉన్నారు. టాలీవుడ్ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసారు. 

వినోద్ స్వస్థలం తెనాలి. ఆయన విశ్వేశ్వ‌ర‌రావు దర్శకత్వంలో 1980లో వ‌చ్చిన కీర్తి కాంత క‌న‌కం అనే సినిమాలో కథానాయకుడిగా నటించారు. కథానాయకుడిగా పరిశ్రమకు పరిచయం అయినా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నాడు.  ఇప్పటి వరకు వినోద్ 300 కు పైగా సినిమాలలో నటించారు. ఆయ‌న చంటి సినిమాలో చేసిన పాత్రకు  ప్ర‌త్యేక గుర్తింపు వచ్చింది.  ఆయన కొన్ని హిందీ, తమిళ చిత్రాలలో కూడా నటించారు. ఆ తర్వాత కొన్ని టీవీ సీరియల్స్ లో కూడా నటించారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post