ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని చూడలేక కడుపు మంట తోనే పాదయాత్ర చేస్తున్నారని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. ఆయన చేయటం వల్ల పాదయాత్రకున్న పవిత్రత పోయిందని, అసలది పాదయాత్రే కాదని, క్యాట్‌వాక్ అని వ్యాఖ్యానించారు.
సులభతర వాణిజ్యం విషయంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం పొందిందని, దేశంలో 10 సెల్ ఫోన్ తయారీ కంపెనీలు వస్తే వాటిలో రెండు ఆంధ్రప్రదేశ్ కె వచ్చాయని ఆయన అన్నారు. ఏపీ తయారైన కారు దశల్లో తిరగబోతోందని, పోలవరం పనులను గడ్కరీ ప్రశంసించారని ఆయన అన్నారు. పోలవరంలో అవినీతి జరుగుతోందని బీజేపీ, వైసీపి అనవసర విమర్శలు చేస్తున్నాయన్నారు.
Post a Comment