పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న ఆరోపణలను బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడటానికి, పనులను పర్యవేక్షించడానికి అసలు బాబు ఎవరు అని అన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అని, కేంద్రం చేపడుతున్న ప్రాజెక్టులను తనవిగా ప్రచారం కల్పించుకోవటానికి బాబు చేస్తున్న చర్యల వల్లే ప్రాజెక్ట్ ఆలస్యమవుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
వైఎస్ రాజ శేఖర రెడ్డి హయాం లోనే ప్రాజెక్టులు తొందరగా నిర్మాణమయ్యాయని, పోలవరం కూడా బాబు అధికారంలోకి వచ్చాక నెమ్మదించింది అన్నారు. కేంద్ర ప్రభుత్వం పోలవరం ముంపు మండలాలను ఎపిలో విలీనం చేయకపోతే ప్రమాణం చేయవద్దని చంద్రబాబు నాయుడుకు తానే సలహా ఇచ్చానని వీర్రాజు అన్నారు.
నాలుగు సంవత్సరాలుగా బాబు ఇస్తానన్న 10 వేల రూపాయల నిరుద్యోగ భృతి ఏమైంది. ఇన్ని సంవత్సరాలపాటు అన్న క్యాన్టీన్లు ఎందుకు గుర్తురాలేదు అని చంద్రబాబును దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఉపాధి హామీ నిధులు తెలుగు దేశం పెద్దల ఉపాధికి ఉపయోగపడుతున్నాయని ఆరోపించారు. గృహ నిర్మాణ పథకం కోసం కేంద్రం ఇచ్చే నిధులను సరిగ్గా వినియోగించుకోలేకపోయారని, అనవసర ఖర్చులతో, అవినీతితో ఆ పథకాన్ని భ్రష్టు పట్టించారని ఆరోపించారు.
Post a Comment