సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణాన సంచరించే కాలాన్ని దక్షిణాయనం అని అంటారు. సూర్యుడు ప్రతినెలలో ఒక రాశినుండి మరొక రాశిలోకి ప్రవేశిస్తుంటాడు. దీనికే సంక్రమణం అని పేరు. సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి మకరరాశిలోకి ప్రవేశించేంత వరకు ఉండే కాలం దక్షిణాయనం. దేవతలకు ఉత్తరాయనం పగలు కాగా, దక్షిణాయనం రాత్రి. ఉత్తరాయనం దేవతలకు దక్షిణాయనం పితృ దేవతలకు ప్రీతికరమని చెబుతారు.
దక్షిణాయనంలో దేవతా ప్రతిష్ట, గృహ గృహప్రవేశం, ఉపనయనం, వివాహం లాంటి కార్యాలు చేయడం తక్కువ. ఉగ్ర దేవతా రూపాలను అంటే సప్త మాతృకలు, భైరవ, వరాహ, నరసింహ, మహిషాసుర మర్ధిని మరియు దుర్గ లాంటి దేవతా మూర్తులను ప్రతిష్ఠించవచ్చని వైఖాన సంహిత చెబుతుంది. కర్కాటక సంక్రమణ సమయంలో అంటే దక్షిణాయన ప్రారంభంలో పుణ్య స్నానాలు, జపతపాలు చేయడం మంచిది. సంక్రమన కాలంలో చేసే పుణ్య స్నానాల వలన రోగాలు నివారించ బడటమే కాకుండా దారిద్య్రం నిర్మూలించబడుతుంది.
Post a Comment