ఇప్పటికే 20 నీటి పారుదల ప్రాజెక్టులు పూర్తయ్యాయి

ఇప్పటికే 20 నీటి పారుదల ప్రాజెక్టులు పూర్తయ్యాయి
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం రోజు మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన 1500 రోజులలో 20 నీటి పారుదల ప్రాజెక్టులు పూర్తయ్యాయని, మరో 24 నీటిపారుదల ప్రాజెక్టులు 2019లో పూర్తి అవనున్నాయని అన్నారు. 

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తో జరిపిన చర్చల ప్రకారం త్వరలో పోలవరం ప్రాజెక్టు విషయమై అధికారుల బృందం న్యూఢిల్లీకి వెళ్లనుందని తెలిపారు. కేంద్రంతో విభేదాలు ఉన్నప్పటికీ ప్రాజెక్టు పనులను ఆపలేదని ఆయన అన్నారు. 

విభజన వల్ల రాష్ట్రం ఆర్థిక కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ నీటి పారుదల రంగానికి 50000 కోట్లు ఖర్చు చేసామని, మరో 24000 వేల కోట్ల ఋణమాఫీ చేసామని వెల్లడించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు, మైనారిటీలకు ప్రాధాన్యత ఇస్తున్నామని, వీటికోసం ఇప్పటికే 60 వేల కోట్లు ఖర్చు చేసామన్నారు. రాష్ట్రంలో ఆగస్టు చివరి నాటికి మరో 100 అన్న కాంటీన్లు ప్రారంభమవుతాయని కూడా తెలిపారు. 

కడప జిల్లాలో అవసరమైతే సొంతంగా ఉక్కు కర్మాగారాన్ని నిర్మించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన పునరుద్ఘాటించారు. దీని కోసం కేంద్ర పన్నుల నుండి మినహాయింపు ఇవ్వాలని కోరామన్నారు. ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్లను సానుభూతితో పరిశీలిస్తుందని, 11వ పేరివిజన్ కమీషన్ను నెలకొల్పామని తెలిపారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post